
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి హుండీని గురువారం లెక్కించారు. మొత్తం రూ. 57,38, 414 ఆదాయం వచ్చింది. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాస రాజు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్ రెడ్డి, పాలకమండలి సభ్యులు , సిబ్బంది అర్చకులు పాల్గొన్నారు.