
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు:పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో శనివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శివాలయం, అలివేలు మంగతాయారు అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడాయి. మన్యంకొండ గిరులు హరి నామ స్మరణ తో మారుమోగాయి.
భక్తులు కోనేరులో స్నానాలు చేసి దాసంగాలు ఇచ్చి, తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వెంకటేశ్వర స్వామి వారిని పద్మావతి అమ్మవారు, అలివేలు మంగతాయారు సమేతంగా శేష వాహనంపై మెట్ల దారి గుండా కోనేరు మైదానం దగ్గరకు తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు చేసి మళ్లీ గర్భాలయంలోకి తీసుకొని వెళ్లారు.