
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : పేదల తిరుపతిగా పేరుగాంచిన రూరల్ మండలంలోని మన్యంకొండ క్షేత్రం భక్తులతో కిక్కిరిసి పోయింది. జాతర కావటంతో వారం రోజులుగా మహారాష్ట్ర, కర్నాటక, ఏపీతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
శనివారం స్వామి దర్శనం కోసం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం మట్టి కుండల్లో దాసంగాలు పెట్టారు. పచ్చి పులుసు, అన్నం నైవేద్యంగా సమర్పించారు. తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ, ఎండోమెంట్ ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు.