జనసంద్రమైన మన్యంకొండ

జనసంద్రమైన మన్యంకొండ

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ ఆదివారం జనసంద్రంగా మారింది. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి జాతర కొనసాగుతోంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామి దర్శనం కోసం క్యూలైన్లలో బారులుదీరారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి. శివాలయం, అలివేలు మంగ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ చైర్మన్  అలహరి మధుసూదన్  కుమార్, ఈవో నిత్యానంద చారి చర్యలు తీసుకున్నారు.