ఐరన్​మైన్స్ పై మావోయిస్టుల దాడి .. చత్తీస్​గఢ్​లోని దంతెవాడలో ఘటన

భద్రాచలం, వెలుగు : చత్తీస్​గఢ్​రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా బచేలీ పోలీస్​స్టేషన్​పరిధిలో ఎన్​ఎండీసీ ఐరన్​ఓర్​ మైన్స్ పై సోమవారం మావోయిస్టులు దాడి చేశారు. సాయుధ మావోయిస్టులు మైన్​లోకి ప్రవేశించి పంప్​హౌస్​, ట్రాన్స్ ఫార్మర్లను తగులబెట్టారు.

ఈనెల 22న తలబెట్టిన భారత్​బంద్​ను జయప్రదం చేయాలంటూ  ఘటనా స్థలంలో కరపత్రాలు, వాల్​పోస్టర్లు వదిలి వెళ్లారు.