మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ.. ఎన్ కౌంటర్‎లో కీలక నేత దామోదర్ మృతి

హైదరాబాద్: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగలింది. మావోయిస్టు పార్టీ కీలక నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారు. రెండు రోజుల క్రితం ఛత్తీస్‎గఢ్ రాష్ట్రంలోని కాంకేర్, బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‎లో దామోదర్ మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ ధృవీకరించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ పేరుతో శనివారం (జనవరి 18) లేఖ విడుదల చేశారు. ఈ ఎన్ కౌంటర్లో దామోదర్‎తో పాటు మరో 17 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు వెల్లడించారు. 

ALSO READ | ఛత్తీస్ గఢ్‎లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి

మావోయిస్టు కీలక నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్‎ స్వస్థలం తెలంగాణలోని ములుగు జిల్లా కల్వపల్లి గ్రామం. ప్రస్తుతం ఆయన తెలంగాణ మావోయిస్ట్ పార్టీ సెక్రటరీగా ఉన్నారు. చిన్నతనంలోనే మావోయిస్టు పార్టీలో చేరిన దామోదర్ రావు అంచెలంచెలుగా ఎదిగారు.  30 ఏళ్ల పాటు పార్టీలో పని చేసిన దామోదర్ ఎన్నో ఏళ్లుగా పోలీసులు మోస్ట్ వాంటెడ్ లిస్ట్‎లో ఉన్నారు. దామోదర్ హెడ్‎పై రూ.50 లక్షల రివార్డ్ ఉంది.