చత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల డంప్​ లభ్యం

భద్రాచలం, వెలుగు : చత్తీస్​గఢ్ ​రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో బుధవారం మావోయిస్టుల ఆయుధాల డంప్​ దొరికింది. డీఆర్​జీ, బస్తర్​ఫైటర్స్ ఆధ్వర్యంలో బలగాలు మావోయిస్టుల ఆపరేషన్​ కోసం బయలుదేరాయి. దంతేశ్​పురి-కోరాజ్ ​పాడు గ్రామ అడవుల్లో బలగాలను చూసిన మావోయిస్టులు పారిపోయారు. అక్కడికి వెళ్లి చూడగా మావోయిస్టుల డంప్ కనిపించింది.

అందులో రెండు బీజీఎల్, రెండు 12 బోల్ట్​ తుపాకులు, బుల్లెట్లు, 16 మినీ రాకెట్​లాంఛర్లు, మందుగుండు సామగ్రి ఉందని సుక్మా ఎస్పీ కిరణ్​చౌహాన్​ తెలిపారు. మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.