
భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల డంప్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సీఆర్‌పీఎఫ్ బలగాలు ఆదివారం దుల్లేడు బేస్ క్యాంప్ సమీపంలోని మర్కన్‌గూడ, మెట్టగూడ అడవుల్లో కూంబింగ్‌కు వెళ్లాయి. ఈ క్రమంలో మావోయిస్టులు వేర్వేరు చోట్ల దాచిన డంపులను గుర్తించారు. భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్న డంప్‌లో ఆరు బర్మార్ తుపాకులు, బీజీఎల్ లాంచర్లు, డిటోనేటర్లు, సెమీ కండక్టర్ సర్క్యూట్లు, ఐరన్ బాల్స్, విప్లవసాహిత్యం, యూనిఫాంలు, బెల్టులు, కిట్ బ్యాగ్‌లు భారీ సంఖ్యలో దొరికాయి. వాటిని సుక్మా జిల్లా కేంద్రానికి తరలించారు.