
- ..రూ. 8 లక్షలతో పాటు జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం
భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గడ్‌లోని గరియా బంద్ జిల్లాలో దొరికిన మావోయిస్టుల డంప్‌ను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.8 లక్షలతో పాటు 13 జిలెటిన్ స్టిక్స్, డైరీ, విప్లవ సాహి త్యం ఉన్నాయి. ఎస్పీ నిఖిల్ రాఖే తెలిపిన ప్రకారం.. మైనపూర్ పీఎస్ పరిధిలోని పండరిపాలి గ్రామ అడవుల్లో చెట్టు కింద అనుమానాస్పద వస్తువు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తో పాటు లోకల్ పోలీసులు, ఎస్టీఎఫ్, కోబ్రా 207, సీఆర్‌పీఎఫ్ జవాన్లు వెళ్లి తనిఖీలు చేశారు. నోట్లు, జిలెటిన్ స్టిక్స్, ఇతర వస్తువులు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకొని గరియాబంద్ జిల్లా కేంద్రానికి తరలించారు.