దండకారణ్యంలో మావోయిస్టుల డంప్​ స్వాధీనం

దండకారణ్యంలో మావోయిస్టుల డంప్​ స్వాధీనం

భద్రాచలం, వెలుగు : చత్తీస్​గఢ్​ దండకారణ్యంలో మావోయిస్టులకు చెందిన భారీ డంప్​ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. సుక్మా జిల్లా చింతగుఫా పోలీస్​స్టేషన్​ పరిధిలో ఏర్పాటు చేసిన మెట్టగూడెం బేస్ ​క్యాంపునకు చెందిన 203 వాహినీ కోబ్రా, 131 బెటాలియన్​ సీఆర్​పీఎఫ్, జిల్లా పోలీసులు శనివారం గుండ రాజుగూడ గ్రామ సమీపంలోని చింతవాగు నది వద్ద ఆపరేషన్​ నిర్వహించారు.

ఈ ప్రాంతంలో మావోయిస్టులు దాచిన డంప్​ను గుర్తించి బయటకు తీశారు. మావోయిస్టులకు చెందిన ఆయుధాలతో పాటు కీలక డాక్యుమెంట్లు దొరికాయి. వాటిలో ఆయుధాలు సమకూర్చుకోవడం, దళాల్లోకి రిక్రూట్​మెంట్, ఆపరేషన్​ కగార్​పై వ్యూహాత్మక దాడులు, ఇన్​ఫార్మర్ల ఏరివేత తదితర అంశాలతో కూడిన వివరాలు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.