ఛత్తీస్‎గఢ్ ఎన్ కౌంటర్లో మరో మావోయిస్టు కీలక నేత మృతి

ఛత్తీస్‎గఢ్ ఎన్ కౌంటర్లో మరో మావోయిస్టు కీలక నేత మృతి

ఛత్తీస్‌గఢ్‌ గరియాబాద్ ఎన్‌కౌంటర్‌లో మరో మావోయిస్టు కీలక నేత మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్లో చలపతి, దామోదర్, పాండు వంటి అగ్ర నాయకులు హతం కాగా.. మావోయిస్టు కీలక నేత చంద్రహాస్‌ను కూడా హతమార్చినట్లు పోలీసులు ప్రకటించారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్‎కు చెందిన ప్రమోద్ అలియాస్ చంద్రహాస్ చిన్నతనంలోనే ఇంటి నుండి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న ప్రమోద్ మావోయిస్టుగా మారినట్లు పేర్కొన్నారు.

ఈస్ట్ జోనల్ బ్యూరో ఇంఛార్జ్‌గా చంద్రహాస్ పని చేస్తున్నట్లు తెలిపారు. మావోయిస్టు చంద్రహాస్‌పై రూ.20 లక్షల రివార్డు ప్రకటించారు. యాప్రాల్‎లో మావోయిస్టు నేత చంద్రహాస్ తల్లిదండ్రులు నరసింహ,లక్ష్మిలు  అక్క పార్వతి చెల్లి మీరా ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని తమకు అప్పగిస్తే అంత్యక్రియలు నిర్వహించుకుంటామని కుటుంబ సభ్యులు తెలిపారు.