భద్రాద్రి కొత్తగూడెంలో మరోసారి కాల్పులు..మావోయిస్టు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. గుండాల మండలం.. దేవలగూడెం, దుబ్బగూడెం అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఫైరింగ్ లో ఓ మావోయిస్టు చనిపోయాడు. కాల్పులతో అలర్టైన కొందరు మావోలు .. ఘటనా స్థలం నుంచి పారిపోయారని తెలుస్తోంది. వారికోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ప్రస్తుతం దేవలగూడెం, దుబ్బగూడెం అటవీ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

జులై 15న కూడా భద్రాద్రి జిల్లాలోని ఏజెన్సీ అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. మణుగూరు  సబ్ డివిజన్ పరిధిలోని కరకగూడెం, ఆళ్లపల్లి మండలాల సరిహద్దులో పోలీసులు, మావోల మధ్య ఫైరింగ్ జరిగింది. గత రెండు, మూడు రోజులుగా గుండాల మండలంలో మావోయిస్టు దళం, యాక్షన్ టీంలు సంచరిస్తున్నారనే సమాచారంతో దేవలగూడెం, దుబ్బగూడెం అడవుల్లో పోలీసులు కూంబింగ్ జరిపారు.

రెండు గ్రామాల సరిహద్దుల్లో గుండాల పోలీసులు, స్పెషల్ పార్టీల ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేస్తున్నారు. నిన్న రాత్రి అందిన పక్కా సమాచారంతో ఈ తెల్లవారుజామున 4గంటల 15 నిమిషాలకు గుండాల సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేశారు. బైక్ పై ఇద్దరు వ్యక్తులు తమను చూసి పారిపోతుండటంతో.. వారిని పోలీసులు వెంబడించారు. లొంగిపొమ్మని గట్టిగా కేకలు వేస్తుంటే.. అకస్మాత్తుగా తమపై కాల్పులు జరిపారన్నారు. అప్రమత్తమైన వెంటనే వారిపై తిరిగి కాల్పులు జరిపారన్నారు. కొద్దిసమయం తర్వాత కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించారు. 25 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని మావోయిస్టు మృతదేహం గుర్తించారు. ఒక ఆయుధం , ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ చెప్పారు. .

ఆదిపురుష్ లో ప్రభాస్ కు విలన్ గా సైఫ్ అలీ ఖాన్

హయ్యెస్ట్..భారత్ లో ఒక్కరోజే 83,883 కేసులు