ములుగు జిల్లాలో మావోయిస్టు మందుపాతర కలకలం..ప్రెషర్ బాంబు పేలి వ్యక్తికి తీవ్రగాయాలు

ములుగు జిల్లాలో మావోయిస్టు మందుపాతర కలకలం..ప్రెషర్ బాంబు పేలి వ్యక్తికి తీవ్రగాయాలు

ములుగు జిల్లాలో మావోయిస్టు మందుపాతర కలకలం రేపింది. వెంకటాపురం మండంల అంకన్న గూడెం సమీపంలోని కర్రె గుట్ట అటవీప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబ్ పేలి ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. 

వెంకటాపురం మండలంలోని అంకన్న గూడెం కు చెందిన బొగ్గుల నవీన్ వెదురు బొంగుల కోసం అడవికి వెళుతుండగా.. కర్రె గుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబ్ పేలింది. దీంతో నవీన్ కాలికి తీవ్రగాయమైంది. చికిత్సకోసం నవీన్ ను ఏటూరు నాగారం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.