మావోయిస్టు కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ కటకం సుదర్శన్(ఆనంద్, దూల) మృతి చెందారు. మే 31న మధ్యాహ్నం గుండెపోటుతో దండకారణ్య జోన్ లో తుది శ్వాస విడిచినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. సుదర్శన్ అంత్యక్రియలు తమ ఆధ్వర్యంలోనే నిర్వహించారు మావోయిస్టులు. గెరిల్లా వార్ లో కటకం సుదర్శన్ కీలక పాత్ర వహించాడు.1978లో ఉద్యమంలో చేరాడు కటకం సుదర్శన్
కటకం సుదర్శన్ ది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, బెల్లంపల్లి కన్నాల బస్తీ. సుదర్శన్ సింగరేణి కుటుంబంలో జన్మించాడు. 1980లో ఆదిలాబాద్ జిల్లా కమిటీ కార్యదర్శిగా ఉండి, ఇంద్రవెల్లి ఉద్యమానికి నాయకత్వం వహించాడు.
కటకం సుదర్శన్ మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర కమిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన బంధు మిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. సుదర్శన్ మృతి భారత విప్లవోద్యామానికి, ప్రపంచ సోషలిస్టు విప్లవానికి తీరని నష్టాన్ని కల్గించిందని వెల్లడించింది. జూన్ 5 నుంచి ఆగస్టు 3 వరకు కటకం సుదర్శన్ స్మారక సభలను నిర్వహించాలని కేంద్రకమిటీ పిలుపునిచ్చింది.