లొంగిపోయిన మావోయిస్టు : భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ బి.రోహిత్​ రాజు

లొంగిపోయిన మావోయిస్టు : భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ బి.రోహిత్​ రాజు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘమైన క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘం సౌత్​ బస్తర్​ డివిజనల్​ కమిటీకి చెందిన మడవి మంగ్లీ పోలీసుల ఎదుట లొంగిపోయారని భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ బి.రోహిత్​ రాజు తెలిపారు. 2003 నుంచి మావోయిస్టు పార్టీలో పలు బాధ్యతలు చేపట్టినట్లు చెప్పారు. ఏసీఎం, ప్లాటూన్లలో మంగ్లీ పని చేశారన్నారు. 2007,2009లో కుంట పోలీస్​స్టేషన్​ పరిధిలో భద్రతా బలగాలపై జరిగిన దాడుల్లో మంగ్లీ పాల్గొన్నారని చెప్పారు. ఆదివాసీలతో మావోయిస్టులకు సంబంధాలు లేవన్నారు. మావోయిస్టులు ఇప్పటికైనా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం లొంగిపోయిన మావోయిస్టుకు నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.