
భద్రాచలం,వెలుగు: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు నిర్మించిన స్మారక స్తూపాలను మహిళా కమాండోలు శుక్రవారం ధ్వంసం చేశారు. భేచాపాల్ అటవీ ప్రాంతంలో డీఆర్జీ, బస్తర్‌ఫైటర్స్ మహిళా కమాండోలు కూంబింగ్‌కు వెళ్లారు. దట్టమైన అడవుల్లో అమరులైన మావోయిస్టులను స్మరించుకునేందుకు స్తూపాలను నిర్మించారు. దీంతో వీటిన చూసిన మహిళా కమాండోలు కూల్చి వేశారు.