ములుగు జిల్లా: చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్, గడ్చిరోలి సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్లకి నిరసనగా మావోయిస్ట్ పార్టీలు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి. బూటకపు ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ ప్రజలంతా బంద్ లో భాగస్వామ్యం కావాలని కోరాయి. బంద్ నేపథ్యంలో ములుగు జిల్లాలోని వెంకటాపురం,- వాజేడు ప్రధాన రహదారి నిర్మానుషంగా మారింది. ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నారు.
మావోయిస్ట్ లు ప్రకటించిన బంద్ పిలుపుతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ములుగు, భూపాలపల్లి ఏజెన్సీ ప్రాతాల్లో భారీగా బలగాలను మోహరించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలన్నీ నిఘా నీడలో ఉన్నాయి. దీంతో మావోయిస్ట్ హిట్ లిస్ట్ లో ఉన్నవాళ్లంతా సురక్షిత ప్రాంతాలకి వెళ్లాలని పోలీసులు సూచించారు.