ములుగు ఎన్కౌంటర్కు నిరసనగా తెలంగాణ బంద్కు మావోయిస్టు పార్టీ పిలుపు.. 

మహబూబాబాద్ జిల్లా: ఇటీవల ములుగు జిల్లా చల్పాక అడవుల్లో జరిగిన  ఎన్కౌంటర్కు నిరసనగా  మావోయిస్టు పార్టీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం, కొత్తగూడ, గంగారం, గూడూరు అడువుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు.

ఏజెన్సీ గ్రామాల్లో ప్రతి ఇంటినీ సోదా చేస్తున్నారు పోలీసులు. అనుమానం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకాన్ స్వయంగా మాజీ నక్సలైట్లపై ఆరా తీస్తున్నారు.  ఒకవైపు మావోయిస్టులు బందుకు పిలుపునివ్వడం, మరోవైపు పోలీసుల విస్తృతస్థాయి సోదాలను చూసీ గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనన్న అనుమానంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.