ఛత్తీస్ గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న వాహనాల్ని దగ్ధం చేశారు. కాంకేర్ జిల్లా మరాపి-కల్ముచే రహదారిలో రోడ్డు నిర్మాణ పనులలో ఉన్న ఐదు వాహనాలకు మావోలు నిప్పు పెట్టారు. కాంకేర్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక జేసిబి,రెండు హైవా, రెండు మిక్సర్ మిషన్లను డీజిల్ ట్యాంక్ పగులగొట్టి మావోయిస్టులు నిప్పంటించారు. ఘటన స్థలంలో బ్యానర్ లను విడిచివెళ్లారు మావోయిస్టులు.రోడ్డు నిర్మాణ పనులలో పాల్గొంటే శిక్ష తప్పదంటూ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
నిరసన తెలిపితే ఎగవడి కొట్టుడే !
సమతామూర్తి విగ్రహంపై నారాయణ కీలక వ్యాఖ్యలు