
భద్రాచలం, వెలుగు: చర్ల పోలీసుల ఎదుట మంగళవారం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టు లొంగిపోయారు. సుక్మా జిల్లా జెట్టిపాడుకు చెందిన మడవి జోగా రెండేండ్ల కింద మిలీషియా కమాండర్ మడకం దేవా వద్ద సభ్యుడిగా చేరాడు. మావోయిస్టులకు నిత్యావసర సరుకులు సప్లై సరఫరా చేయడంలో జోగా కీలకంగా వ్యవహరించాడు. ఛత్తీస్ గఢ్‌లో ప్రస్తుతం పెరుగుతున్న భద్రతా బలగాల ఒత్తిళ్లతో మావోయిస్టులు భద్రాచలం డివిజన్ చర్ల పోలీసులను ఆశ్రయించి లొంగిపోతున్నారు. ఈ క్రమంలో ఓఎస్డీ పంకజ్ పరితోష్ సమక్షంలో జోగా లొంగిపోయాడు. అతడికి ఓఎస్డీ పారితోషికాన్ని అందజేశారు.