జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టు మచ్చ సోమయ్య (62) పోలీసుల ఎదుట లొంగిపోయారు. సోమయ్యపై తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో కలిపి 4 కేసులు వున్నాయి. సోమయ్యపై రూ.8లక్షల రివార్డ్ ఉంది.
అనారోగ్య కారణాలతో మచ్చల సోమయ్య లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన సోమయ్యకు మావోయిస్టుల సరెండర్ పాలసీలో భాగంగా భూమిని ఇస్తామని జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరె చెప్పారు. ఆయనపై ఉన్నరివార్డు రూ. 8లక్షల చెక్ ను అందజేశారు.