భద్రాచలం, వెలుగు: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో పోలీసుల ఎదుట సోమవారం ఓ మావోయిస్టు దళ కమాండర్ లొంగిపోయాడు. సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ కథనం ప్రకారం...2010లో జిల్లాలోని తాడిమెట్ల వద్ద మావోయిస్టులు అంబుష్ చేసి 76 మంది జవాన్లను హత్య చేశారు. ఇందులో పాల్గొన్న కమాండర్నగేశ్అలియాస్ఎర్రా.. మావోయిస్టు సిద్ధాంతాలు నచ్చక జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని నిర్ణయించుకుని సుక్మా పోలీసులను సంప్రదించాడు.
ఇతడిపై రూ.8లక్షల రివార్డు ఉంది. ప్రస్తుతం పీఎల్జీఏ కంపెనీ బెటాలియన్నెంబరు2 కంపెనీకి కమాండర్‌గా నగేశ్వ్యవహరిస్తున్నాడు. మావోయిస్టులు లొంగిపోవాలని, ప్రభుత్వం తరుపు నుంచి వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ప్రకటించారు.