ఇల్లెందులో మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు

ఇల్లెందు, వెలుగు: మావోయిస్టులకు మందు గుండు సామగ్రి సప్లయ్​ చేస్తున్న సానుభూతిపరులను అరెస్ట్​ చేశామని భద్రాద్రి జిల్లా ఇల్లెందు సీఐ కురుణాకర్​తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ బస్డాండ్​లో తనిఖీలు చేస్తుండగా ఏడుగురు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా మావోయిస్టులకు మందుగుండు సామగ్రి సరఫరా చేస్తున్నట్టు ఒప్పుకున్నారన్నారు.

ఒడిశాలోని మల్కాన్​గిరి జిల్లాకు చెందిన సున్నం కన్నా, సున్నం గంగా, మడకం లచ్చా, ఇల్లెందు మండలానికి చెందిన జాడిపేటి రమేశ్, ఖమ్మం జిల్లా సింగరేణి మం డలం విశ్వనాథపల్లికి చెందిన బోడ నర్సింహా, మహబూబాబాద్ టౌన్​కు చెందిన మహమ్మద్ యాకూబ్ పాషా, ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన ఆలకుంట వెంకన్నలను అరెస్ట్​ చేశామన్నారు.  400 జిలి టిన్ స్టిక్స్, వేయి డిటోనేటర్లు,  మూడు కార్డ్​ఎక్స్​ బండిల్స్​కేబుళ్లు, 25మీటర్ల సెఫ్టీ ప్యూజ్​ వైర్ స్వా ధీనం చేసుకున్నామన్నారు. ఎస్ఐ అప్పారావు తనిఖీల్లో పాల్గొన్నారు.