మావోయిస్టు అగ్రనేత హిడ్మా తల్లి ఎక్కడ..?

మావోయిస్టు అగ్రనేత హిడ్మా తల్లి ఎక్కడ..?

భద్రాచలం, వెలుగు: మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగ్రనేత మడవి హిడ్మా తన తల్లిని మరో గ్రామానికి తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. హిడ్మాతో పాటు మరో అగ్రనేత దేవా బార్సా సొంతూరు చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పువ్వర్తి. మావోయిస్టుల అణచివేతలో భాగంగా పువ్వర్తి గ్రామ సమీపంలో ఇటీవల కేంద్ర హోంశాఖ బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసింది. క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమీపంలోనే హిడ్మా, దేవా బార్సా ఇండ్లు ఉన్నాయి. గతంలో సుక్మా ఎస్పీ తన బలగాలతో కలిసి హిడ్మా ఇంటికి వెళ్లి అతని తల్లిని పరామర్శించారు. 

ఆమెకు వైద్యం చేసి మందులు, నిత్యావసర సరుకులు అందజేశారు. అయితే హిడ్మా తల్లి కొన్ని రోజులుగా గ్రామంలో కనిపించడం లేదు. సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎస్టీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలగాల ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హిడ్మా ఇంటిపై ఉండడం, మీడియాలో ప్రముఖంగా కథనాలు రావడంతో హిడ్మానే తన తల్లిని మరో గ్రామానికి తరలించారని గ్రామస్తులు అంటున్నారు. అయితే ఎక్కడకు తీసుకెళ్లారు..? ఎక్కడ ఉంచారు..? అనేది మాత్రం తెలియడం లేదు. 

పువ్వర్తి పక్కనే ఉన్న గుండం గ్రామానికి ఈ నెల 16న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా వచ్చారు. స్థానికంగా ఓ చెట్టు కింద కూర్చొని ఆదివాసీలతో ముచ్చటించారు. తమ అడ్డాలోకి బలగాలు చేరడంతో హిడ్మా, దేవా బార్సాలు తమ స్థావరాల్ని మార్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మరో వైపు హిడ్మా, దేవా బార్సా ఇండ్లను భద్రతాబలగాలు కూల్చి వేశాయని వచ్చిన ఆరోపణలను సుక్మా ఎస్పీ కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌహాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖండించారు. తమ బలగాలు ఎవరి ఇండ్లను కూల్చలేదని 
స్పష్టం చేశారు.