ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. నారాయణపూర్ జిల్లా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోమల్ మాంజిని హత్య చేశారు. చోటే డోంగార్ పీఎస్ పరిధిలో శీతలా ఆలయంలో పూజలు చేసేందుకు వచ్చిన కోమల్ మాంజీని ఆలయ సమీపంలో గొడ్డళ్లతో నరికి చంపారు.
మైనింగ్ వ్యాపారులకు సపోర్ట్ చేస్తున్నాడని పలుమార్లు మావోయిస్టులు కోమల్ మాంజీని హెచ్చరించారు. నారాయణ పూర్ జిల్లాలో ఐరన్ ఓర్ గనులున్నాయి. వీటిని నిర్వహిస్తున్న యజమానులకు మాంజి సహకరిస్తున్నాడని శీతలా ఆలయంలో పూజ కోసం వచ్చిన మాంజిని అక్కడే చంపేశారు. అయితే గతంలో ఇదే చోటే దొంగార్ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాగర్ సాహునీ కూడా హతమార్చారు మావోయిస్టులు.