ఛత్తీస్గఢ్లో లోని సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ క్యాంపులపై మావోయిస్టులు దాడులకు దిగారు. ఒకేసారి గుంపులుగా సీఆర్ పీఎఫ్ క్యాంపులను చుట్టుముట్టారు. రాకెట్ లాంచర్లతో ముప్పేట దాడికి చేశారు. దీంతో సీఆర్ పీఎఫ్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
ఆదివారం ఉదయం సీఆర్పీఎఫ్ సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో సీఆర్ పీఎఫ్ సబ్ ఇన్ స్పెక్టర్ మృతిచెందగా, కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. ఈ క్రమంలో సీఆర్ పీఎఫ్ 165వ బెటాలియన్ బృందం మావోయిస్టు లకోసం సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా జాగర్ గుండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.