పోలీస్‌‌ వాహనాన్ని పేల్చిన మావోయిస్టులు

పోలీస్‌‌ వాహనాన్ని పేల్చిన మావోయిస్టులు
  • ఇద్దరు జవాన్లకు గాయాలు
  • చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌  జిల్లాలో ఘటన

భద్రాచలం, వెలుగు : చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌ జిల్లా భూపాలపట్నం నేషనల్‌‌ హైవేపై గొర్లనాల వద్ద పోలీసుల పికప్‌‌ వాహనాన్ని ఆదివారం సాయంత్రం మావోయిస్టులు మందుపాతరతో పేల్చారు. అయితే వాహనం ముందుకు వెళ్లిన తర్వాత మందుపాతర పేలడంతో పెను ప్రమాదం తప్పగా.. ఇద్దరు జవాన్లు స్వల్పంగా గాయపడ్డారు. మందుపాతర పేల్చిన అనంతరం నక్సల్స్‌‌ కాల్పులు జరపడంతో అలర్ట్‌‌ అయిన జవాన్లు సైతం ఎదురుకాల్పులు జరిపారు. దీంతో నక్సల్స్‌‌ అడవిలోకి పారిపోయారు. తర్వాత గాయపడిన జవాన్లను బీజాపూర్‌‌ హాస్పిటల్‌‌కు తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే బీజాపూర్‌‌ ఎస్పీ జితేంద్రయాదవ్‌‌ అదనపు బలగాలను సంఘటనా స్థలానికి తరలించారు. జవాన్లను సురక్షితంగా సమీప బేస్‌‌ క్యాంప్‌‌నకు తీసుకొచ్చారు.