చింతూరు రహదారిలో కారును దహనం చేసిన మావోయిస్టులు

చింతూరు రహదారిలో కారును దహనం చేసిన మావోయిస్టులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం–చింతూరు మధ్య రహదారిపై మంగళవారం మావోయిస్టులు కారును దహనం చేశారు. ఏపీలోని​చింతూరు నుంచి భద్రాచలం వస్తున్న ఓ కారును సరివెల వద్ద మావోయిస్టులు ఆపారు. కారులో ఉన్న వారిని దింపి తగలబెట్టారు. కారును తగలబెట్టడంతో అందులో ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు.

పీఎల్జీఏ వారోత్సవాల ముగింపు సందర్భంగా కారును దహనం చేసినట్లు మావోయిస్టులు పేర్కొన్నారని తెలిసింది. ఇదిలా ఉండగా భద్రాచలం–చింతూరు మధ్య కారును మావోయిస్టులు తగలబెట్టిన ఘటనతో ఈ రహదారిలో కొంత సేపు వెహికల్స్​ రాకపోకలు నిలిచిపోయాయి. మావోయిస్టుల కోసం పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్​ చేపట్టారు.