సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్పై దాడి

  • కాల్పులతో విరుచుకుపడ్డ మావోయిస్టులు
  • ముగ్గురు జవాన్లకు గాయాలు

భద్రాచలం: ఛత్తీస్‌ గఢ్–తెలంగాణ బార్డర్‎లోని జీడిపల్లి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ పై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన బీజాపూర్‌ పోలీసులు వారికి ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు.

 ఇటీవల ఈ నూతన క్యాంపును హోం శాఖ ఏర్పాటు చేసింది. పీఎల్జీఏ వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టులు క్యాంపుపై కాల్పులతో విరుచుకుపడ్డారు.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి.మరోవైపు మావోయిస్టుల కోసం భద్రతా దళాలు కూంబింగ్​ను ఉధృతం చేశాయి.