ఛత్తీస్‎గఢ్‎లో రెచ్చిపోయిన మావోయిస్టులు.. జవాన్ల వాహనంపై మెరుపు దాడి

ఛత్తీస్‎గఢ్‎లో రెచ్చిపోయిన మావోయిస్టులు.. జవాన్ల వాహనంపై మెరుపు దాడి

ఛత్తీస్‎గఢ్‎లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఇటీవల భద్రతా దళాల చేతిలో ఎదురవుతోన్న వరుస ఎదురు దెబ్బలకు ప్రతీకారం తీర్చుకునే ప్రయ్నతం చేశారు. ఇందులో భాగంగానే ఆదివారం (మార్చి 23) ఎస్టీఎఫ్​ జవాన్లు ప్రయాణిస్తోన్న వాహనంపై మెరుపు దాడి చేశారు. మద్దేడి పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా సిబ్బంది వెళ్తోన్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఐఈడీ బాంబ్ పేల్చారు. ఐఈడీ పేలుడులో ఇద్దరు ఎస్టీఎఫ్​ జవాన్లు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గాయపడ్డ జవాన్లు ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలంలో భద్రతా బలగాలు వెంటనే కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడ్డ మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. 

ALSO READ | IIT Guwahati: దేశ సరిహద్దు్లలో AI రోబోలతో నిఘా

ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించలేదు. కాగా, ఇటీవల ఛత్తీస్‎గఢ్‎లో భారీ ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే, బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో  భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు  జరిగాయి. ఈ రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు హతమయ్యారు. నక్సలైట్ల ఎదురు కాల్పుల్లో ఓ డీఆర్జీ జవాన్ సైతం మరణించాడు. బీజాపూర్‌లో 26 మంది, కాంకేర్‌లో నలుగురు నక్సలైట్లు మరణించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్లకు ప్రతీకారంగానే మావోయిస్టులు తాజా దాడి జరిపినట్లు తెలుస్తోంది.