ఆ ఊళ్ళో బాంబులు పెట్టాం.. ఎవరూ రావొద్దు.. మావోయిస్టుల సంచలన లేఖ..

ఆ ఊళ్ళో బాంబులు పెట్టాం.. ఎవరూ రావొద్దు.. మావోయిస్టుల సంచలన లేఖ..

అక్కడ బాంబులు పెట్టాం ఎవరూ రావొద్దు.. ఇలాంటి హెచ్చరికలు సినిమాలోనో లేదంటే.. ఏ టెర్రరిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోనో వినబడుతుంటాయి. తెలంగాణలోని ములుగు జిల్లాకు ఇలాంటి వార్నింగ్ ఇచ్చారు మావోయిస్టులు. ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం కర్రీగుట్ట చుట్టూ బాంబులు పెట్టమంటూ మంగళవారం ( ఏప్రిల్ 8 ) సంచలన లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. మావోయిస్టుల లేఖతో ములుగు జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. 

ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం కర్రీగుట్ట చుట్టూ బాంబులు అమర్చామని.. కర్రీగుట్ట పరిసరాలకు ఎవరూ రావద్దని.. లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. వాజేడు - వెంకటాపురం ఏరియా కమిటీ శాంత పేరుతో లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. ఆపరేషన్ కగార్ దాడి నుంచి రక్షణ కోసమే కర్రీగుట్టపై బాంబులు అమర్చామని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టులు. వేట కోసం, షికారు కోసం కర్రీగుట్ట దగ్గరకు వచ్చి ప్రాణాలు కోల్పోవద్దని హెచ్చరించారు.

Also Read : బతికున్నవ్యక్తి చనిపోయినట్లు రికార్డ్

మావోయిస్టుల రక్షణ కోసం అమర్చిన బాంబులు తొక్కి అమాయక ప్రజలు చనిపోతున్నారని .. మరికొంతమంది గాయపడుతున్నారని.. పోలీసులు ప్రజలకు డబ్బులు ఇస్తూ.. మాయమాటలు చెప్పి ఇన్ఫార్మర్లుగా మార్చుకుంటున్నారని అన్నారు. పోలీసుల మాయమాటలు వలలో పడి కర్రీగుట్ట పైకి ప్రజలు ఎవరు రావద్దని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టులు.