ఇసుక మాఫియాపై లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

  • పద్ధతి మార్చుకోకపోతే ప్రజాకోర్టులో శిక్షిస్తాం: మావోయిస్టులు

ములుగు జిల్లా : ఏజన్సీలో ఇసుక మాఫియాపై మావోయిస్టులు స్పందించి  లేఖ విడుదల చేశారు. జేఎండబ్ల్యూ కార్యదర్శి వెంకటేష్ పేరుతో విడుదల చేసిన లేఖలో ఆదివాసి ఇసుక సొసైటీ రీచ్ లలో మాఫియా చొరబడి దోచుకుంటోందని ఆరోపించారు. కొందరు కాంట్రాక్టర్లు ఆదివాసీలను విభజించి పాలించాలని చూస్తున్నారని, యువతను తాగుడుకు బానిసలుగా మార్చి గ్రూపులుగా చీల్చి పబ్బం గడుపుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకపోతే ప్రజాకోర్టులో శిక్షిస్తామని మావోయిస్టులు హెచ్చరించారు. మావోయిస్టులు విడుదల చేసిన లేఖ దిగువన మీరే చూడండి..