ములుగు జిల్లా మేడారం జాతరపై మావోయిస్టులు విడుదల చేసిన లేఖ కలకలం రేపింది. మేడారం జాతరకు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని (JMWP) కార్యదర్శి వెంకటేష్ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మేడారం జాతరకు వచ్చిన ప్రజలకు సౌకర్యాలు లేవని విమర్శించారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను పూర్తిగా ఆదివాసి సంప్రదాయాలతోనే చేయాలని.. హిందూ సంప్రదాయాలైన లడ్డు, పులిహోర లాంటివి కాకుండా బెల్లం ప్రసాదంగా ఇవ్వాలని ఆదేశించారు. జాతరలో ఎవరైనా అనారోగ్యం పాలైతే.. వారికి వెంటనే చికిత్స అందించాలని తెలిపారు.
జాతర పనుల కోసం పంట పొలాలు నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పారు. పంట పొలాల్లో బ్రాందీ సీసాలతో పాటు రకరకాల వ్యర్థ పదార్థాలు అన్నిటిని తీసివేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకుని చేయాలి. జాతర ఆయన వెంటనే ప్రభుత్వం నిధులు కేటాయించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలని మావోయిస్టులు లేఖలో కోరారు.
Also Read : క్రీడలతో మానసికోల్లాసం : జే.సత్యనారాయణ