గ్రేటర్​లో ఆస్తులపై మ్యాపింగ్ సర్వే షురూ

గ్రేటర్​లో ఆస్తులపై మ్యాపింగ్ సర్వే  షురూ
  • పూర్తయితే 100 శాతం ప్రాపర్టీ ట్యాక్స్ ​కలెక్షన్​కు చాన్స్​ 

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాపర్టీల మ్యాపింగ్ ​కోసం అధికారులు మంగళవారం జీఐఎస్(జియోగ్రాఫిక్​ఇన్ఫర్మేషన్​సిస్టమ్స్) సర్వేను ప్రారంభించారు. అర్బన్ ప్లానింగ్ లో భాగంగా బల్దియా అధికారులు ఈ సర్వేను చేపట్టారు. సర్వే పూర్తయితే సిటీ పరిధిలోని ఆస్తులు, యుటిలిటీల లెక్క తేలుతుంది. వాటి మ్యాపింగ్ ద్వారా పన్నుల వసూలు మరింత ఈజీ కానుంది. ఆస్తి పన్ను వసూలు అధికారులకు సవాల్​గా మారుతోంది. 

ఏటా పూర్తిస్థాయిలో వసూలు కావడం లేదు. జీఐఎస్​సర్వే పూర్తయితే ఆ సమస్యకు చెక్​పడనుందని అధికారులు చెబుతున్నారు. ఈ సర్వేతో హై రిజల్యూషన్ మ్యాపింగ్​తో బిల్డింగ్స్, రోడ్లు, పార్కులు ఇతర సదుపాయాల వివరాలు స్పష్టంగా తెలుస్తాయన్నారు. ముందుగా ఉప్పల్, హయత్ నగర్, హైదర్ నగర్, కూకట్ పల్లి, కేపీహెచ్​బీ కాలనీ, మియాపూర్, చందానగర్ ఏరియాల్లో సర్వే మొదలైంది. సర్వే కోసం వచ్చే సిబ్బందికి భవన నిర్మాణ అనుమతి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, లేటెస్ట్ గా చెల్లించిన ఆస్తి పన్ను రసీదు, నల్లా బిల్లు, విద్యుత్ బిల్లు, యజమాని ఐడీ, ట్రేడ్ లైసెన్స్ నంబర్(కమర్షియల్ భవనాల) వివరాలు అందించి సహకరించాలని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కోరుతున్నారు.