అడవి జంతువులను వేటాడితే చర్యలు : మక్సూద్​ మోహినుద్దిన్

మణుగూరు, వెలుగు: అడవి జంతువులను చంపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్​డీఓ సయ్యద్ మక్సూద్​ మోహినుద్దిన్ హెచ్చరించారు. శనివారం మణుగూరు సబ్ డివిజన్ అటవీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అడవుల్లో వేట కొనసాగిస్తున్నారని సమాచారంతో గొత్తి కోయలు నివసించే 26 గ్రామాల్లో సోదాలు చేపట్టామని, తనిఖీల్లో సుమారు 1000 బాణాలు, బరిసెలు, 100 కేజీల ఉచ్చు వైర్లు, దుప్పి, జింక కొమ్ములు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ఎవరూ అడవుల్లోకి వేటకు వెళ్లొద్దని వారికి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. సమావేశంలో రేంజ్ ఆఫీసర్లు ద్వాలియ, తేజస్విని, రమేశ్, సెక్షన్ ఆఫీసర్లు గోవింద్, వెంకటలక్ష్మి, నాగరాజు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు