మరాఠా కోటా ఉద్యమకారుడు మనోజ్ జరంగే ఆమరణ దీక్ష

మరాఠా కోటా ఉద్యమకారుడు మనోజ్ జరంగే ఆమరణ దీక్ష

ముంబై :  మరాఠా కోటా ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్ శనివారం ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠా రిజర్వేషన్లపై మాట తప్పితే జూన్ 4 తర్వాత ఆమరణ దీక్షకు దిగుతానని ఆయన ఈ ఏడాది ఏప్రిల్ లోనే హెచ్చరించారు. ముందుగా చెప్పినట్టే ఆయన ఆమరణ దీక్షను ప్రారంభించారు. నిరసన తెలియజేస్తున్న వారి పై దాడులు చేసే అవకాశం ఉందని, వారంతా అలర్ట్ గా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 

ఈసారి మరాఠా రిజర్వేషన్ల అంశం తేల్చక పోతే అక్టోబర్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతానని మనోజ్ హెచ్చరించారు. గతంలో పాలించిన మహా వికాస్ అఘాడీ ప్రభు త్వం, ప్రస్తుత మహాయుతి కూటమి ప్రభుత్వం మరాఠా రిజర్వేషన్ల కోసం ఏమీ చేయలేదని ఆయన ఆరోపించారు. రెండు ప్రభుత్వాలూ తమను తప్పుదోవ పట్టించాయన్నారు. 

అయితే, మనోజ్ జరంగే నిరవధిక దీక్షకు పర్మిషన్ లేదని మరఠ్వాడా రీజియన్ లోని జల్నా సిటీ గోండి పోలీసులు తెలిపారు. మనోజ్ దీక్షకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానికంగా ఉన్న మూడు గ్రామాల ప్రజల నుంచి తమకు ఫిర్యా దులు కూడా అందాయన్నారు. కాగా, మరాఠా రిజర్వేషన్ల కోసం మనోజ్ ఈ ఏడాది ఫిబ్రవరి లో నిరాహార దీక్ష చేపట్టారు. మహారాష్ట్ర బీసీ కమిషన్ సిఫారసుల ప్రకారం.. మరాఠాలకు10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసింది. దీంతో 17 రోజుల నిరాహార దీక్షను మనోజ్ విరమిం చారు. అయితే, మరాఠాలకు ప్రత్యేకంగా రిజ ర్వేషన్లు కాకుండా.. ఓబీసీ కోటాలోనే రిజర్వే షన్లు ఇవ్వాలని మనోజ్ డిమాండ్ చేశారు. తాజాగా ఆమరణ దీక్షను ప్రారంభించారు.