జూనియర్ ఎన్టీఆర్ (NTR) అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ దేవర (Devara). ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో నందమూరి ఫ్యాన్స్ వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఇక దేవర ఆగమనం మరికొన్ని గంటల్లోనే మొదలవ్వబోతుంది. రేపు సెప్టెంబర్ 27 శుక్రవారం దేవర రీలిజ్ కానుంది.
ఈ నేపథ్యంలో..స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ తెరకెక్కిస్తున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ దేవర, వరద (వర) అనే రెండు విభిన్న పాత్రలు చేస్తుండగా.. జాన్వీతో పాటు మరో హీరోయిన్ కూడా నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేయకపోయినప్పటికీ.. ట్రైలర్ చూస్తే అర్డమైపోతుంది.
ఇందులో దేవర (ఎన్టీఆర్) భార్యగా మరాఠీ నటి శ్రుతి మరాఠే(Shruti Marathe)ని ఎంచుకున్నారు కొరటాల. ఇపుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంత..శృతి మరాఠే ఎవరనేది సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు.
ఎవరీ శ్రుతి మరాఠే?
శ్రుతి మరాఠే..గుజరాత్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి. ఆమె మరాఠ, హిందీ,తమిళ మూవీస్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. 2008లో మరాఠీలో వచ్చిన సనై చౌఘడే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.ఇక ఎన్టీఆర్ సరసన దేవరలో నటిస్తుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..శ్రుతి మరాటే కూడా రియాక్ట్ అయింది.
Also Read :- తెలంగాణ, ఏపీలో దేవర టికెట్ ధరలు.. ఎలా ఉన్నాయంటే?
దేవరలో నటిస్తున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో శ్రుతీ మాట్లాడుతూ..'దేవరలో సినిమాలో నేను భాగం అయినట్లు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసింది. అందులో నేను దేవరకు భార్యగా కనిపిస్తాను. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ అభిమానుల మాదిరే నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.' అని చెప్పారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంత..శృతి మరాఠే ఎవరనేది తెగ సెర్చ్ చేస్తున్నారు.
అలాగే తారక్ అంటే చాలా ఇష్టం అని శ్రుతి మరాఠే పోస్ట్ చేయడంతో..ఈ వార్త నిజమేనంటూ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. మరి దేవరతో టాలీవుడ్లో ఫేమస్ అవ్వడం కన్ఫర్మ్. కానీ,ఇప్పటివరకు దేవర మేకర్స్ ఈ విషయంపై చెప్పకపోవడం..సస్పెన్స్ మెయెంటెన్ చేయడం మరింత ఆసక్తి నెలకొంది.
Marathi actress Shruti Marathe to play Jr NTR wife in Devara movie
అయితే, ఈమె ఇంస్టాగ్రామ్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ లో ఉంది. తన వీడియోస్, ఫొటోస్ షేర్ చేస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో శ్రుతి మరాఠే దర్శనం కాబోతుండగా..ఎలాంటి హైప్ క్రియేట్ చేయబోతుందో చూడాలి.