శివశక్తి - తప త్యాగ తాండవ్' సీరియల్ తో ఫేమస్ అయిన టెలివిజన్ నటుడు యోగేష్ మహాజన్ ఆదివారం గుండెపోటు కారణంగా కన్నుమూశారు. అయితే గత రెండు రోజులుగా యోగేష్ మహాజన్ సీరియల్ షూటింగ్ కి హాజరుకాక పోవడంతో మేకర్స్ కి అనుమానం వచ్చింది. దీంతో ఆదివారం ఉమర్‌గావ్ ఫ్లాట్ కి వెళ్లి చూడగా యోగేష్ మహాజన్ విగతజీవిగా పడి ఉన్నాడు.
దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా, యోగేష్ మహాజన్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అలాగే యోగేష్ మృతికి హటాత్తు గుండెపోటు కారణమని డాక్టర్స్ నిర్ధారించారు. అయితే యోగేష్ కి భార్యతోపాటు 7 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కానీ కుటుంబ సమస్యల కారణంగా యోగేష్ ఒంటరిగా ఫ్లాట్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది.
యోగేష్ మహాజన్ 'ముంబైచే షహానే, సంసార్చి మాయ' వంటి మరాఠీ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుస షోలు సీరియల్స్ లో నటించి ఇటు బుల్లితెర ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యాడు. ఇందులో ముఖ్యంగా శివశక్తి సీరియల్ లో గురు శుక్రాచార్య పాత్రతో బుల్లితెర ఆడియన్స్ ని అలరించాడు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేని కుటుంబ నుంచి వచ్చినప్పటికి యోగేష్ మహాజన్ ఇండస్ట్రీలో బాగానే నిలదొక్కుకున్నాడు. కానీ కార్డియాక్ అరెస్ట్ కారణంగా 44 ఏళ్ళ వయసులోనే కన్ను మూశాడు. దీంతో పలువురు అభుమానులు, సన్నహితులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.