14 వ తేదీ మనకు హోలీ.. వరుసగా మూడు రోజులు సెలవులు

14 వ తేదీ మనకు హోలీ.. వరుసగా మూడు రోజులు సెలవులు

హోలీ అంటే రంగుల పండుగ ఈ  ఏడాది ఈ పండుగను ఎప్పుడు జరుపుకోవాలో అన్న విషయాన్ని పండితులు తేల్చేశారు.  మార్చి 14 శుక్రవారం రంగుల పండుగను ( హోలీ ) జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇక ఆతరువాత మరో రెండు రోజులు కూడా సెలవులు రావడంతో జనాలు హోలీ సంబరాలను గ్రాండ్​ గా చేసుకునేందుకు సిద్దమవుతున్నారు. 

దేశ వ్యాప్తంగా రంగుల పండుగ జనాలు రడీ అవుతున్నారు.  రంగుల పండుగ అంటే అదేనండి హోలీ. ఈ ఏడాది ( 2025)  హోలీ పండుగ మార్చి 14 వ తేది శుక్రవారం జరుపుకోవాలని పండితు సూచిస్తున్నారు.  రంగు రంగుల పండుగను  జరుపుకుంటున్నారు.  ఇక హోలీ పండుగ తరువాత జనాలు ఫుల్​ కుషీగా ఉండేందుకు కూడా సిద్దమవుతున్నారు. ఎందుకంటే హోలీ తరువాత వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి.  హోలీ పండుగ శుక్రవారం కాగా.. శనివారం.. ఆదివారం సెలవులు రావడంతో ఈ ఏడాది బారీగా సంబరాలు చేసుకునేందుకు సిద్దమవుతున్నారు.

ALSO READ | గ్రీన్ టీ ఎక్కడ పుట్టింది? మనదాకా ఎలా వచ్చింది? దీని వెనకున్న చరిత్రేంటి?

హోలీ పండుగకు దేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను కులమతాలకు అతీతంగా దేశంలోని ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. కానీ హోలీ పండుగ విషయంలో ప్రజల్లో అనుమానం నెలకొంది. హోలీ పండుగను ఎప్పుడు జరుపుకోవాలని చాలా మందిలో సందేహం కలుగుతోంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని కృష్ణ పక్ష ప్రతిపాద తిధి నాడు హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ సారి హోలీ పండుగ మార్చి 14, శుక్రవారం నాడు జరుపుకుంటారు. హోలీకి ఒక రోజు ముందు హోలికను దహనం చేసే సంప్రదాయం ఉంది. ఈ ఏడాది  హోలీ తరువాత మరో రెండు రోజులు సెలవులు వచ్చాయి.