
- పోస్టర్లను ఆవిష్కరించిన పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
బషీర్‌బాగ్, వెలుగు: మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని కోరుతూ ఈ నెల 18,19 తేదీల్లో ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు మట్టా జయంతి తెలిపారు. మంగళవారం గాంధీ భవన్లో చలో ఢిల్లీ కార్యక్రమ వాల్‌పోస్టర్‌ను పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ ఆవిష్కరించారు.
అనంతరం కాచిగూడలో మట్టా జయంతి మీడియాతో మాట్లాడారు. మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కల్పించినప్పుడే రాజ్యాధికారం దక్కుతుందన్నారు. ఇప్పటికే రాజ్యసభలో బిల్లును ఆమోదించారని, లోక్ సభ లో ప్రవేశపెట్టి పూర్తిచేయాలని కోరారు. అసెంబ్లీలో మొక్కుబడి తీర్మానం చేసి చేతులు దులుపుకుంటే సరిపోదన్నారు. కార్యక్రమంలో బీసీ నేతలు గుజ్జ కృష్ణ, స్వప్న, రమా, శ్రీనివాస్, ఉదయ్, శ్రీను పాల్గొన్నారు.