సండే స్పెషల్: ఈ వారం ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, వెబ్ సీరీస్లు ఇవే.. ఓ లుక్కెయ్యండి..

సండే స్పెషల్: ఈ వారం ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, వెబ్ సీరీస్లు ఇవే.. ఓ లుక్కెయ్యండి..

40 ఏండ్ల క్రితం హత్య!

టైటిల్ : రేఖా చిత్రం
ప్లాట్​ ఫాం : సోనీలివ్‌‌‌‌,
డైరెక్షన్ : జోఫిన్‌‌‌‌ టి చాకో 
కాస్ట్​ : అసిఫ్‌‌‌‌ అలీ, అనస్వర రాజన్‌‌‌‌, మమ్ముట్టి, మనోజ్‌‌‌‌ కె జయన్‌‌‌‌, సిద్ధిఖీ
 

వివేక్‌‌‌‌ (ఆసిఫ్‌‌‌‌ అలీ) ఒక సస్పెండ్‌‌‌‌ అయిన పోలీస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌. అప్పుడే తిరిగి విధుల్లో చేరతాడు. అదేటైంలో రాజేంద్రన్‌‌‌‌ (సిద్ధిఖీ) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ కేసుని వివేక్​ ఇన్వెస్టిగేట్‌‌‌‌ చేయాల్సివస్తుంది. రాజేంద్రన్‌‌‌‌ చనిపోకముందు తన ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌ లైవ్‌‌‌‌లో ఒక ప్లేస్​ని చూపిస్తూ.. అక్కడ మహిళ శవం ఉందని, విన్సెంట్‌‌‌‌ (మనోజ్‌‌‌‌ కె.జయన్‌‌‌‌)తోపాటు మరో ముగ్గురితో కలిసి 40 ఏండ్ల క్రితం ఆ శవాన్ని తానే పూడ్చానని చెప్తాడు. ఆ తర్వాత అక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ వీడియోలో ఉన్న వివరాల ఆధారంగా వివేక్‌‌‌‌ ఇన్వెస్టిగేషన్​ మొదలుపెడతాడు. ఆ ప్రాంతంలో తవ్వి చూడగా, నిజంగానే మహిళ పుర్రె, ఎముకలు దొరుకుతాయి. ఆ మహిళ చనిపోయి చాలా ఏండ్లు గడవడంతో వివేక్​కు సరైన ఆధారాలు దొరకవు. అలాంటి కేసుని వివేక్​ ఎలా ఛేదించాడు? ఇంతకీ హంతకులని పట్టుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ. 

అసలైన ప్రేమ 


టైటిల్ : నాదానియ, ప్లాట్​ ఫాం : నెట్‌‌‌‌ఫ్లిక్స్,
డైరెక్షన్ : షౌనా గౌతమ్
కాస్ట్​ : ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్, మహిమా చౌదరి, జుగల్ హన్స్‌‌‌‌రాజ్, అర్చన పురాన్ సింగ్, దియా మీర్జా, సునీల్ శెట్టి 

అర్జున్ మెహతా (ఇబ్రహీం అలీ ఖాన్) గ్రేటర్ నోయిడాలోని ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. అతను గొప్ప లాయర్​ కావాలని కలలు కంటుంటాడు. పియా జైసింగ్ (ఖుషి కపూర్) దక్షిణ ఢిల్లీలో ఉంటుంది. ఆమెది సంపన్న కుటుంబం. ఆమె సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్ కూడా​. కొన్ని కారణాల వల్ల పియా నెలకు రూ.25,000 అర్జున్‌‌‌‌కు ఇచ్చి తన బాయ్​ఫ్రెండ్​గా నటించేందుకు నియమించుకోవాలి అనుకుంటుంది. మంచి బట్టలు, పుస్తకాలు కొనడానికి కావాల్సిన డబ్బు వస్తుందని అర్జున్​ కూడా అందుకు ఒప్పుకుంటాడు. అర్జున్ తల్లిదండ్రులు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటారు. పియా జైసింగ్ తండ్రి (సునీల్ శెట్టి) ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుంటాడు. ఆమె తల్లి (మహిమా చౌదరి) ఎప్పుడూ ఏదో పార్టీకి వెళ్తూ.. బిజీగా ఉంటుంది. దాంతో పియా ఒంటరిగా ఫీల్​ అవుతుంటుంది. అలాంటి పియా, అర్జున్​ల మధ్య నిజమైన  ప్రేమ చిగురించిందా? లేదా? అనేది అసలు కథ. ​​​​​​

చంపిందెవరు? 


టైటిల్ : న్యాన్​ కందత సారే, 
ప్లాట్​ ఫాం : సోనీ లివ్​,
 డైరెక్షన్ : వరుణ్ జి. పనికర్
కాస్ట్​ :  ఇంద్రజిత్ సుకుమారన్, అనూప్ మీనన్, బైజు

తన చెల్లి అనుమోల్ (పార్వతి అరుణ్)తో కలిసి నివసించే ఒక ట్యాక్సీ డ్రైవర్ జోకుట్టన్ (ఇంద్రజిత్). అతను చాలా అమాయకుడు. ఒకరోజు రాత్రి తన స్నేహితుడితో కలిసి ఒక లాడ్జిలో ఉంటాడు. ఆ టైంలోనే  ఒక హత్య జరగడం చూస్తాడు. అతన్ని ఎవరు చంపారు?  బాడీని ఏం చేశారు? అన్నీ అతనికి తెలిసిపోతాయి. దాంతో షాక్​లోకి వెళ్లిపోతాడు. అతనికి ఎలా స్పందించాలో అర్థం కాదు. మరుసటి రోజు ఉదయం చనిపోయింది అసిస్టెంట్ సబ్ ఇన్‌‌‌‌స్పెక్టర్ సుదేవ్ (అర్జున్ నందకుమార్) అని తెలుసుకుంటాడు జోకుట్టన్​. కనిపించకుండా పోయిన ఆ ఆఫీసర్​​ గురించి సమాచారం ఇచ్చిన వాళ్లకు బహుమతి ఇస్తారని తన ఫ్రెండ్ చెప్పిన మాటలను నమ్మి, జోకుట్టన్ పోలీస్ స్టేషన్‌‌‌‌కు వెళ్తాడు. కింది స్థాయి అధికారులు కేసును తారుమారు చేసే అవకాశం ఉందని విషయాన్ని డివైఎస్పీ శ్రీకాంత్ (దీపు కరుణాకరన్)కు చెప్పాలి అనుకుంటాడు. అందుకే పోలీస్​ స్టేషన్​కు వెళ్లేముందే డివైఎస్పీ శ్రీకాంత్‌‌‌‌కు ఫోన్​ చేస్తాడు. కానీ.. అక్కడ అతనికి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి.