మార్చి 29 సూర్యగ్రహణం: ఆ సమయంలో చదవాల్సిన మంత్రం ఇదే..

మార్చి 29 సూర్యగ్రహణం:   ఆ  సమయంలో చదవాల్సిన మంత్రం ఇదే..

హిందువులు గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమయంలో ఎవరూ ఏ పని చేయరు.  ఇక గర్భిణీ స్త్రీలు అయితే ఆ సమయంలో బెడ్​ దిగరు.. కాలు కదపరు.. ఇక బ్రాహ్మణులు అనుష్ఠానం.. జపం చేసుకుంటారు. ఈ ఏడాది మార్చి 29న సూర్యగ్రహణం రాబోతుంది.  ఆ రోజు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని జపం చేస్తే అనేక శుభఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆ మంత్రాన్ని తెలుసుకుందాం. . 

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యగ్రహణాన్ని చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు.  ఈ ఏడాది మార్చి 29న సూర్యగ్రహణం ఏర్పడుతుంది.  ఆ రోజు మధ్యాహ్నం 2.21 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.16 గంటలకు ముగుస్తుంది. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజున గ్రహణం అయిన తరువాత దానధర్మాలు చేయడం చాలా మంచిదని చెబుతున్నారు. 

గ్రహణం సమయంలో అనుష్ఠానం/జపం చేయడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి.  సూర్యగ్రహణ సమయంలో సూర్యుని మంత్రాన్ని పలుమార్లు చదవడం వలన చాలా ఉపయోగాలుంటాయి. సూర్య మంత్రాన్ని జపం చేయడం వలన కేరీర్​.. వ్యాపారంలో అభివృద్ది ఉంటుంది.  ఇంకా దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు జపాన్ని చేయించుకుంటే  తగ్గుతాయని చెబుతున్నారు. 

Also Read : ఇంట్లోనే తయారు చేసుకునే ఈ మందు వాడితే.. దోమలు రమ్మన్నా రావు..
 
చదవాల్సిన  సూర్య మూల మంత్రం: ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః
ఈ బీజాక్షరాలను తప్పుల్లేకుండా పఠించాలి.  ఇది చదవలేని వారు క్రింద తెలిపిన శ్లోకాన్ని పఠించాలి

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ ।
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ 

ఇవి  సూర్యుడికి సంబంధించిన ప్రాథమిక మంత్రాలు. . సూర్యగ్రహణం రోజున మాత్రమే కాదు ఈ మంత్రాన్ని ఇతర రోజులలో కూడా జపించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. 

సూర్యగ్రహణం రోజున మీరు ఈ సూర్య మంత్రాన్ని జపిస్తే.. అది జీవితంలో ఆనందం, శాంతిని తెస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. సూర్యుడిని జ్ఞానానికి అధిష్టాన దైవంగా కూడా పరిగణిస్తారు. కనుక సూర్యగ్రహణ సమయంలో సూర్యునికి సంబంధించిన మంత్రాన్ని జపిస్తే.. అది జ్ఞానాన్ని తెలివి తేటలను పెంచుతుంది. ఈ మంత్రాన్ని సూర్యగ్రహణం రోజు నుంచి ప్రారంభించి.. ప్రతిరోజూ లేదా ప్రతి ఆదివారం జపించడం అత్యంత ఫలవంతమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.