
మహిళలపై రోజు రోజుకు దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని హింసలేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ది ఓబస్టట్రిక్స్ & గైనకాలజీకల్ సోసైటీ ఆఫ్ హైదరాబాద్ (ఒ.జి.ఎస్.హెచ్) అధ్యక్షురాలు డాక్టర్ ఎస్.శాంతకుమారి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న నెక్లెస్ రోడ్డులోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో మహిళలపై హింస చేయవద్దు అనే అంశంపై అవగాహన కల్పించి, వాక్ ధన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ కార్యక్రమంకు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాద్ హైదర్ గూడలోని ఎన్ఎస్ఎస్ లో జరిగింది. వాక్ధన్ కార్యక్రమానికి రాష్ట్రమంత్రి సీతక్క, పరిశ్రమలు, వాణిజ్యశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ లు హాజరుకానున్నట్లు తెలిపారు