మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ నటించిన ‘మార్కో’ రీసెంట్‌గా విడుదలై అన్నీ భాషల్లో సూపర్ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా మలయాళంలో రూ. వంద కోట్ల క్లబ్‌లో చేరి టాప్ గ్రాసర్‌గా నిలిచిన చిత్రాల్లో నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సీక్వెల్ కోసం మోహన్ లాల్‌ను కలిసి ఉన్ని ముకుందన్ చర్చించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం వీరిద్దరు కలిసున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ కలయిక సినిమా కోసమా, మరేదైనా విషయమా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే చాలామంది నటీనటులు, దర్శక నిర్మాతలు ‘మార్కో’ టీమ్‌ను ప్రత్యేకంగా కలిసి ఈ సినిమా సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్ తెలియజేశారు. కానీ ఇప్పుడు మోహన్ లాల్‌ను టీమ్ కలవడంతో ‘మార్కో2’ కోసమే అని చర్చ జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు సక్సెస్ సాధించడంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. హనీఫ్ అదేని ఈ చిత్రానికి దర్శకుడు.