ఇండియన్‌ గ్రాండ్‌ ప్రి విన్నర్‌ బెజ్జెకి

ఇండియన్‌ గ్రాండ్‌ ప్రి విన్నర్‌ బెజ్జెకి

న్యూఢిల్లీ:  మోటో జీపీ– ఇండియన్ గ్రాండ్‌ ప్రి తొలి ఎడిషన్​లో మూనీ వీఆర్‌‌46 డుకాటి  రేసింగ్  టీమ్‌ రైడర్‌ మార్కో బెజ్జెకి (ఇటలీ) చాంపియన్‌గా నిలిచాడు.  గ్రేటర్ నొయిడాలోని బుద్ధ్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌లో జరిగిన ఫైనల్‌ రేసును బెజ్జెకి 36 నిమిషాల 59.157 సెకండ్లలో  పూర్తి చేసి టైటిల్ నెగ్గాడు. ప్రమాక్ డుకాటి టీమ్ రైడర్‌ జార్జ్‌ మార్టిన్‌ (స్పెయిన్‌) రన్నరప్‌గా నిలవగా, మోన్‌స్టర్ యమహా రైడర్‌‌ ఫాబియో మూడో  ప్లేస్‌ సాధించాడు.