ఐపీఎల్ రెండో రోజు మెగా ఆక్షన్ లో భాగంగా సౌతాఫ్రికా ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ కు జాక్ పాట్ తగిలింది. ఈ సఫారీ ఆల్ రౌండర్ ను పంజాబ్ కింగ్స్ రూ. 7 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా మార్కో జాన్సెన్ ప్రపంచ టీ20 లీగ్ లో మంచి రికార్డ్ ఉంది. లోయర్ ఆర్డర్ లో భారీ హిట్టింగ్ చేయడంతో పాటు కొత్త బంతితో స్వింగ్ చేయగలడు. ఆక్షన్ కు భారత జట్టుపై అద్భుతంగా ఆడాడు. 200 కి పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయడం విశేషం. మరోవైపు బౌలింగ్ లోనూ సత్తా చాటాడు.
Also Read : కనీస ధరకు కష్టంగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు RCB కెప్టెన్
రెండో రోజు చాలా మంది స్టార్ ఆటగాళ్లు అన్ సోల్డ్ గానే మిగిలిపోయారు. అయితే జాన్సెన్ కు మాత్రం మంచి ధర పలికింది. చివరి రెండు సీజన్ లలో మార్కో జాన్సెన్ సన్ రైజర్స్ తరపున ఆడాడు. అయితే ఈ సీజన్ లో అతనికి అవకాశాలు తక్కువగా వచ్చాయి. ప్రస్తుతానికి రెండో రోజు అత్యధిక ధర పలికిన ఆటగాడు జాన్సెన్ కావడం విశేషం. 2025 సీజన్ కు ఈ సౌతాఫ్రికా ఆల్ రౌండర్ ను సన్ రైజర్స్ రిటైన్ చేసుకోవడానికి ఆసక్తి చూపించలేదు.
Marco Jansen sold to Punjab Kings at 7cr. pic.twitter.com/EdrxqqjCTA
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 25, 2024