
మలయాళంలో ఆమధ్య ప్రముఖ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటించిన "మార్కో" సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్ లో మలయాళ ప్రముఖ డైరెక్టర్ హనీఫ్ అదేని తెరకెక్కించాడు. ఈ సినిమాలో జగదీష్, కబీర్ దుహాన్ సింగ్, సిద్ధిక్, అన్సన్ పాల్ మరియు యుక్తి తరేజా తదితరులు ప్రధాన తారాగణంగా నటించగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందించాడు.
ఉన్ని ముకుందన్ పవర్ఫుల్ యాక్షన్, డైరెక్టర్ టేకింగ్, రవి బస్రూర్ మ్యూజిక్ ఇవన్నీ చక్కగా వర్కౌట్ అయ్యాయి. దీంతో మార్కో రిలీజ్ అయిన 25 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. అంతేకాదు ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది.
ALSO READ | Laila OTT: ఓటీటీలోకి విశ్వక్‍సేన్ లైలా.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
మార్కో చిత్ర యూనిట్ కి సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉండటం, అలాగే కొన్ని సన్నివేశాలలో రక్తపాతం ఎక్కువగా ఉందని అందుకే టెలివిజన్ లో ప్రసారం చెయ్యద్దని ఆదేశాలు జారే చేసింది. ఈ క్రమంలో శాటిలైట్ హక్కులని టీవీ ఛానెల్స్ కి అమ్మెందుకు రిక్వెస్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‍సీ) కి రిక్వెస్ట్ చెయ్యగా తిరస్కరించింది. దీంతో మార్కో సినిమా ప్రసారం టెలివిజన్ ఛానెల్స్ లో లేనట్లేనని తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం మార్కో సినిమా ప్రముఖ ఓటీటీలైన సోనీలివ్, ఆహా లో అందుబాటులో ఉంది. ఇందులో మార్కో మలయాళ వెర్షన్ సోనీలివ్ లో అందుబాటులో ఉండగా, తెలుగు వెర్షన్ ఆహాలో చూడవచ్చు.