మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మార్కో సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకి మలయాళ ప్రముఖ డైరెక్టర్ హనీఫ్ అదేని దర్శకత్వం వహించగా స్టార్ ప్రొడ్యూసర్ క్యూబ్స్ షరీఫ్ మహమ్మద్ నిర్మించాడు. మార్కో సినిమా గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది. అయితే మార్కో రిలీజ్ అయిన 3 వారాల్లోనే దాదాపుగా రూ.100 కోట్లు పైగా కలెక్ట్ చేసింది.
దీంతో మేకర్స్ జనవరి నెలలో ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన 6వ సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఓటిటి రిలీజ్ కోసం ఉన్ని ముకుందన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు.
Also Read : రష్మిక మందన్నకు సహాయం చేయని విజయ్ దేవరకొండ
ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓటిటిలో మార్కో సినిమా ని రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమా ఓటిటి హక్కులని సోనీ లివ్ సంస్థ దక్కించుకుంది. ఇందుకోసం దాదాపుగా రూ.30 కోట్లు బడ్జెట్ వెచ్చించినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో హీరో ఉన్ని ముకుందన్ యాక్టింగ్, డైరెక్టర్ టేకింగ్, రవి బస్రూర్ బీజియం ఇలా అన్నీ కూడా ఆడియన్స్ ని కట్టిపడేశాయని చెప్పవచు. దీంతో హీరో ఉన్ని ముకుందన్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా రికార్డులు క్రియేట్ చేశాడు.