బిగ్ బాష్ లీగ్ (BBL).. ఐపీఎల్ తరహాలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే ఈ టోర్నీకి మంచి పాపులారిటీ ఉంది. ఒకరకంగా చెప్పాలంటే.. ఐపీఎల్‌కు ప్రాణం పోసిందే బిగ్ బాష్. ఇప్పటి వరకు 13 సీజన్ల పాటు అభిమానులను అలరించిన బీబీఎల్.. మరోసారి మజా పంచేందుకు మీ ముందుకొస్తోంది. డిసెంబర్ 15 నుంచి ఈ లీగ్ షురూ కానుంది. ఈ క్రమంలో రాబోయే సీజన్‌లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా మెల్‌బోర్న్ స్టార్స్ యాజమాన్యం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
మెల్‌బోర్న్ యాజమాన్యం.. 14వ సీజన్‌కు తమ కొత్త కెప్టెన్‌గా మార్కస్ స్టోయినిస్‌ను నియమించింది. గత ఎడిషన్‌లో స్టార్స్‌కు నాయకత్వం వహించిన మ్యాక్స్‌వెల్.. ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో స్టోయినిస్‌కు పగ్గాలు అప్పగించింది. అతను మరో మూడేళ్ల పాటు జట్టుతో కొనసాగనున్నాడు. ఈ క్రమంలోనే స్టార్స్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. 35 ఏళ్ల స్టోయినిస్ గత సీజన్‌లో మాక్స్‌వెల్ గైర్హాజరీలో ఒకసారి స్టార్స్‌కు నాయకత్వం వహించాడు.
బాధ్యతలు పెంచారు..
కెప్టెన్‌గా తన పేరును ప్రకటించడం ద్వారా బాధ్యతలు మరింత పెరిగాయని స్టోయినిస్ చెప్పుకొచ్చాడు. నాయకుడిగా జట్టును నడిపించడం గొప్ప గౌరవమని వర్ణించాడు.
Also Read:-మిల్లర్ భారీ సిక్సర్.. కొడితే స్టేడియం దాటి రోడ్డుపై పడిన బంతి..
మ్యాక్స్‌వెల్ సారథ్యంలో మెల్‌బోర్న్ స్టార్స్ 65 మ్యాచ్‌ల్లో తలపడగా.. 34 విజయాలు అందుకుంది. మరో 30 ఓటమీ పాలైంది. ఇక స్టోయినిస్ తాను కెప్టెన్‌గా ఉన్న ఏకైక గేమ్‌లో జట్టును గెలిపించలేకపోయాడు.
Introducing your BBL|14 Captain, @MStoinis pic.twitter.com/Q7tYMRVFCh
— Melbourne Stars (@StarsBBL) December 10, 2024