BBL 14: ఔటయ్యాడని గ్రౌండ్‌లోనే బ్యాట్ విసిరేసిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్

BBL 14: ఔటయ్యాడని గ్రౌండ్‌లోనే బ్యాట్ విసిరేసిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్

బిగ్ బాష్ లీగ్ ఆదివారం (డిసెంబర్ 15) గ్రాండ్ గా ప్రారంభమైంది. సీజన్ తొలి మ్యాచ్ లో మెల్‌బోర్న్ స్టార్స్, పెర్త్ స్కార్చర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేస్తున్న మెల్‌బోర్న్ స్టార్స్ ఇన్నింగ్స్ లో ఒక డ్రామా చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 12 వ ఓవర్ చివరి బంతిని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఫాస్ట్ బౌలర్ రిచర్డ్‌సన్ వేసిన బంతిని మిడాన్ దిశగా ఆడాడు. సింగిల్ కోసం నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న ఆటగాడికి కాల్ ఇచ్చాడు. 

మిడాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న ఆండ్రూ టై మెరుపు త్రో కారణంగా బంతి డైరెక్ట్ గా వేగంగా వికెట్లను తగిలింది. అప్పటికే క్రీజ్ లోకి రాలేకపోయానని గ్రహించిన స్టోయినిస్ అసహనంతో బ్యాట్ ను వెనక్కి విసిరాడు. థర్డ్ అంపైర్ స్క్రీన్ మీద ఔట్ అని చూపించడంతో నిరాశగా పెవిలియన్ కు చేరాడు. ఈ మ్యాచ్ లో అప్పటివరకు బాగా బ్యాటింగ్ చేసిన ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ఇన్నింగ్స్ నిర్మించే సమయానికి ఔటయ్యాడు. 33 బంతుల్లో 3 ఫోర్లు.. ఒక సిక్సర్ తో 37 పరుగులు చేసి ఔటయ్యాడు.

Also Read:-సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ.. ఫైనల్లో పడిదార్‌కు భయపడ్డ ముంబై.. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మెల్‌బోర్న్ స్టార్స్ పై పెర్త్ స్కార్చర్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. టామ్ కరణ్ (37), స్టోయినిస్(37) రాణించారు. లక్ష్య ఛేదనలో పెర్త్ స్కార్చర్స్ 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి గెలిచింది. కొనొల్లి హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.